📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipet99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా-ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు...

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా-ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు – బాలల భద్రత & రక్షణ..మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పటిష్టం..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్, ఏప్రిల్ 27,ప్రజావాణి

ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు – బాలల భద్రత & రక్షణ మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి, అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ , వివిధ జిల్లా శాఖ అధికారులతో కలిసి దత్తత సహాయ కేంద్రం (అడాప్షన్ హెల్ప్ డెస్క్) ఊయల కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు – బాలల భద్రత & రక్షణ మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు – బాలల భద్రత & రక్షణ  మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారోత్సవాలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను ఆర్డీవోలు, ఎంపీడీవోలు, పోలీస్ , మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని చెప్పారు. ఈ సంక్షేమ వారోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ సోమవారం రోజున ఉదయం దత్తత సహాయ కేంద్రంను ప్రారంభించి మధ్యాహ్నం కలెక్టరేట్ నందు హాఫ్ డే ఆఫ్టర్ కేర్ క్యాంప్ నిర్వహణలో శిశు సంరక్షణ సంస్థలలో అనంతర సంరక్షణ (ఆఫ్టర్ కేర్), పిల్లలకు వ్యక్తిగత అనంతర సంరక్షణ ప్రణాళిక (ఇండివిజువల్ ఆఫ్టర్ కేర్ ప్లాన్ ఐ ఏ పి ) గృహ, విద్యా, నైపుణ్యాల, జీవన ఉపాధి, ఆరోగ్యం మరియు మార్గదర్శకత్వానికి అనుసంధానం చేయడం గురించి శిశు సంరక్షణ సంస్థలలో నివాస ఉండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు మానసిక ఆరోగ్యం, అక్రమ ర వాణా దుర్బలత్వం నిరాశ్రయత పదార్థ వినియోగం మరియు అవసరమైన సూచనలను డాక్టర్ శాంతి (మానసిక వైద్య నిపుణులు, సిద్దిపేట)  అవగాహన కార్యక్రమంలో సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి శారద, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, డాక్టర్ శాంతి మానసిక వైద్య నిపుణురాలు (జి జి  హెచ్)  సిద్దిపేట, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు  చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular