📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్9 మంది పోలీసులకు మరణశిక్ష

9 మంది పోలీసులకు మరణశిక్ష

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)తమిళనాడులోని శాతాంకుళం పట్టణంలో 2020 జూన్ 19న కోవిడ్-19 లాక్‌డౌన్‌ కర్ఫ్యూ సమయం దాటిన తర్వాత కూడా షాపు తెరిచి ఉంచారనే కారణంతో పోలీసులు జయరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.తన తండ్రి అరెస్టు గురించి తెలిసి జయరాజ్ కుమారుడు బెన్నిక్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.అక్కడ అతడిని కూడా అక్రమంగా నిర్బంధించారు.జూన్ 19 రాత్రి నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు తండ్రీకొడుకులిద్దరినీ అత్యంత క్రూరంగా హింసించారు.వారిని లాఠీలు, ఇనుప రాడ్లతో కొట్టడంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది. సాక్ష్యాలను దాచడం కోసం పోలీస్ స్టేషన్ ఫ్లోర్‌పై పడిన రక్తపు మరకలను బాధితుల బట్టలతో వారితోనే బలవంతంగా తుడిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.కస్టోడియల్ డెత్ కేసుల్లో సాధారణంగా జరిగే పరిణామాల మాదిరిగానే.ఇక్కడ కూడా శాతాంకుళం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వినీల.బాధితుల శరీరాలపై ఉన్న గాయాలను రికార్డ్ చేయలేదు.రిమాండ్‌కు వారు ఫిట్‌గా ఉన్నారని క్లియరెన్స్ ఇచ్చారు.జూన్ 20న వారికి కోర్టు రిమాండ్ విధించింది. తండ్రీకొడుకులు ఇద్దరినీ కోవిల్‌పట్టి సబ్ జైలుకు తరలించారు.అక్కడ జూన్ 22న తండ్రీకొడుకులిద్దరూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేశారు. వారిని ఆసుపత్రికి తరలించగా.అదేరోజు రాత్రి బెన్నిక్స్ తుది శ్వాస విడిచాడు.ఆ తర్వాత జూన్ 23వ తేదీ తెల్లవారుజామున అతని తండ్రి జయరాజ్ మరణించారు.ఈ సంఘటన జరిగిన వెంటనే.జూన్ 24న మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుతం రిటైర్ అయిన జస్టిస్ పి.ఎన్.ప్రకాష్, జస్టిస్ బి. పుగలేంధి ఈ విషయంపై CB-CID దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును విచారిస్తున్న జుడిషియల్ మేజిస్ట్రేట్‌కు పోలీసు రక్షణ కల్పించారు.సాక్ష్యాలను భద్రపరచడం కోసం చరిత్రలో మొదటిసారిగా పోలీస్ స్టేషన్‌ను లాక్ చేయాలని ఆదేశించారు.జూలై 7న రాష్ట్ర ప్రభుత్వం ఈ దర్యాప్తును CBIకి బదిలీ చేసింది.సీబీఐ సెప్టెంబర్ 2021లో 2000 పేజీలకు పైగా ఉన్న ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది.ఇందులో ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు,విచారణ సమయంలో కోవిడ్-19తో మరణించిన స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాల్ దురైతో సహా పది మంది పోలీసులను నిందితులుగా పేర్కొంది.2022 ఆగస్టులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.సీబీఐ మొత్తం 105 మంది సాక్షులను విచారించి,116 పత్రాలను సమర్పించింది. అప్పటి నుండి,ఈ కేసు ట్రయల్ కోర్టులో వరుస విచారణలు,క్రాస్ ఎగ్జామినేషన్లకు గురైంది.ప్రధాన నిందితుడు శ్రీధర్ అప్రూవర్‌గా మారడానికి దాఖలు చేసిన పిటిషన్‌తో సహా.నిందితులు దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు,మద్రాస్ హైకోర్టు,సుప్రీంకోర్టు కూడా కొట్టివేసాయి.ఈ కేసులో న్యాయం గెలవడం వెనుక చాలా మంది సాక్షులు ఉన్నప్పటికీ.ప్రధాన సాక్షి,మహిళా కానిస్టేబుల్ రేవతి కృషి మరువలేం. సొంత డిపార్ట్‌మెంట్ నుంచే బెదిరింపులు ఉన్నప్పటికీ బెదరకుండా సాక్షం చెప్పారు.సీబీఐ విచారణలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు.ఆఖరికి లాకప్‌లో రక్తపు మరకలను తుడిచేసినా.మూలల్లో అంటుకుని ఉన్న చిన్న చిన్న మరకలను సీబీఐ అధికారులకు ఆమె చూపించారట. మొత్తానికి ఒక పోలీస్ చెప్పిన సాక్ష్యంతోనే 9 మంది పోలీసులకు మరణశిక్ష పడింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular