📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*సిపిఐ సీనియర్ నాయకులు గుండ్లూరు అబ్దుల్ ఖాదర్ గారు అనారోగ్యంతో బాధపడుతూ పొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్నటి దినం పరమపదించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన పోరుమామిళ్ల పట్టణంలోని బెస్తవీధిలో ఉన్న వారి స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ గారు జీవితాంతం ప్రజాసేవకు అంకితమై పనిచేసిన ఆదర్శ నాయకుడని, ఆయన మరణం పార్టీకి మరియు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సీఎం భాష, జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, ఎంపీటీసీ ఇషాక్, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు గాజులపల్లె రవిచంద్ర రెడ్డి, చాపాటి నారాయణరెడ్డి, ఒకటవ సచివాలయం కన్వీనర్ హుస్సేన్ పీరా, పార్టీ సీనియర్ నాయకులు షేక్ మస్తాన్, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular