📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సూర్య క్యాలెండర్ ను ఆవిష్కరించిన MRO అనిల్ కుమార్, MPDO కృపాకర్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 06(ప్రజావాణి):

నిజాలను నిర్భయంగా చాటి చెబుతూ, యధార్థ వార్తలను వాస్తవాలను ప్రజలకు చేరువ చేస్తున్న పత్రిక సూర్య దినపత్రిక అని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల తాసిల్దార్ ఎడ్ల అనిల్ కుమార్, ఎంపీడీవో దొండ కృపాకర్ అన్నారు. ఎండపల్లి మండల రిపోర్టర్ చిలక సతీష్ , ఎండపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నల్లాల కుమార్, పాత్రికేయులు ప్రజావాణి జిల్లా స్టాఫర్ ఉప్పు రమేష్, బెత్తపు లక్ష్మి రాజం లతో కలిసి సూర్య దిన పత్రిక క్యాలెండర్ ను శుక్రవారం రోజున వారి వారి కార్యాలయాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో కృపాకర్ మాట్లాడుతూ…. పత్రికా రంగంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పత్రిక సూర్య దినపత్రిక అని, సమాజ పరిస్థితులను అవగాహన చేసుకుని వాటిని ప్రజలకు చేరువ చేయడంలో దినపత్రిక చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి గా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న సూర్య దినపత్రిక ప్రజలకు వార్తలు అందించడంలో తనదైన ముద్ర వేసుకుందన్నారు, సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పత్రికల ద్వారా ప్రచురింపజేసి అధికారులు పరిష్కారం చేయించడంలో తన వంతు సామాజిక బాధ్యతగా భావించి వార్తలు అందిస్తుందని తెలుపుతూ, శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular