📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్5K సబ్‌స్క్రైబర్ల మైలురాయి చేరుకున్న NSH ఛానెల్.. ఘనంగా సంబరాలు

5K సబ్‌స్క్రైబర్ల మైలురాయి చేరుకున్న NSH ఛానెల్.. ఘనంగా సంబరాలు

📰 Generate e-Paper Clip

  1. బెజ్జంకి,జూన్ 20(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన జాలిగాం నరేష్ నిర్వహిస్తున్న NSH ఛానెల్ 5 వేల (5K) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని చేరుకోవడంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఛానెల్ ఎండీ జాలిగాం నరేష్ తమ తండ్రి జాలిగాం రాములు చేతుల మీదుగా కేక్ కట్ చేసి విజయోత్సవాన్ని జరుపుకున్నారు.అనంతరం జాలిగాం రాములు మాట్లాడుతూ,NSH ఛానెల్‌ను ఆదరించి సబ్‌స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే, నాణ్యమైన వార్తలు మరియు ఆసక్తికరమైన కార్యక్రమాలతో ప్రేక్షకుల ఆదరణను మరింతగా పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఛానెల్ ప్రతినిధులు పాల్గొని, NSH ఛానెల్ మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular