📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammam24 గంటల లోపే పట్టుబడిన నాగులవంచ చోరీ నిందితులు

24 గంటల లోపే పట్టుబడిన నాగులవంచ చోరీ నిందితులు

📰 Generate e-Paper Clip

24 గంటల లోపే పట్టుబడిన నాగులవంచ చోరీ నిందితులు

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

నాగులవంచలో జరిగిన చోరీ కేసులో నిందితులను 24 గంటలు గడవక ముందే దొంగలను వైరా సీఐ అదుపులోకి తీసుకోవడం జరిగినట్లు తెలుస్తోంది. నాగులవంచ లో గురువారం ఉదయం ఆటోలో వచ్చి తాళం వేసిన తలుపును తన్ని తలుపు పగలగొట్టి రైతు ఆలస్యం శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబపడ్డారు. నాలుగు బంగారు గాజులు( 90గ్రాములు ), 14,500 రూపాయల క్యాష్, ఉంగరం చోరీ చేశారు. చోరీ చేసిన 14,500 రూపాయల్లో రెండున్నర వేలు ఖర్చు చేయగా మిగిలిన 12వేల నగదను పోలీసులు రికవరీ చేసినట్లు తెలుస్తుంది. నిందితుల్లో ఒకరు ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన వాడు కాగా, మరొకరు చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన వాడు. ఆ ఇరువురి పోలీసులు ఆదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీ జరిగిన 24 గంటల్లోపులోపే వైరా సీఐ వెంకటేశ్వర్లు దొంగలను అదుపులోకి తీసుకోవటం విశేషం..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular