📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్*కొండ్రాజుపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం: 281 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్‌గా నల్లేరు...

*కొండ్రాజుపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం: 281 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్‌గా నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి ఘన విజయం.10కి 10 వార్డులు క్లీన్ స్వీప్!

📰 Generate e-Paper Clip

అవధూత కాశినాయన :నవంబర్26ప్రజావాణి అవధూత కాశినాయన మండల పరిధిలోని కొండ్రాజుపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది.బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి దిశానిర్దేశంలో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి 281 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.వార్డుల్లోనూ తిరుగులేని ఆధిక్యం.10కి 10 క్లీన్ స్వీప్!సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా,గ్రామంలోని మొత్తం 10 వార్డు స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఘన విజయం సాధించి విజయఢంకా మోగించారు.విపక్షాలకు కనీసం ఒక్క వార్డులో కూడా గెలిచే అవకాశం ఇవ్వకుండా,10 వార్డులను క్లీన్ స్వీప్ చేయడం విశేషం.ఈ ఏకపక్ష విజయం కొండ్రాజుపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ సాధించిన చారిత్రాత్మక విజయంగా నిలిచింది.

నల్లేరు విశ్వనాథ రెడ్డి నాయకత్వానికి దక్కిన ప్రజాదరణ:

ఈ అఖండ విజయం బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరువిశ్వనాథ రెడ్డి నాయకత్వంపై ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకానికి,ఆయన బలపరిచిన అభ్యర్థికి లభించిన ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.గ్రామంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు,పార్టీ బలోపేతానికి ఆయన పడిన శ్రమ ఈ రోజు ఈ భారీ విజయానికి దారి తీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రజల నమ్మకమే మా బలం: నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి

విజయం అనంతరం నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆశీర్వాదమే మా విజయం.ప్రజల నమ్మకమే మా బలం.ప్రజాసేవే మా లక్ష్యం!అంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు.నల్లేరు విశ్వనాథ రెడ్డిఅండదండలతో,గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.గ్రామంలో మిన్నంటిన సంబరాలు: కొండ్రాజుపల్లిలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ సాధించడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా కాలుస్తూ,రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు.విజయం సాధించిన నల్లేరు చంద్రశేఖర్రెడ్డి కి,ఈ విజయానికి వెనకుండి నడిపించిన నల్లేరు విశ్వనాథరెడ్డికి పార్టీ శ్రేణులు,గ్రామ పెద్దలు ఘనంగా అభినందనలు తెలియజేశారు.ఈ విజయంతో మండల వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ క్యాడర్‌లో నూతనోత్సాహం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.