📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్రావల్కోల్ వార్డులో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్

రావల్కోల్ వార్డులో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్

📰 Generate e-Paper Clip

*రావల్కోల్ వార్డులో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్*

*పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్*

మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడంతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ అధికారులకు సూచించారు. రావల్కోల్ వార్డులో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా వార్డులోని పరిసరాల పరిశుభ్రత, మురుగునీటి కాలువల పరిస్థితి, పారిశుద్ధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. ఈ క్రమంలో సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. వార్డులో ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, మురుగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోకుండా శుభ్రం చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యమని, అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులను కేవలం ఒకరోజుకే పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం మున్సిపాలిటీ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, వార్డులో పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని శ్రీదేవి రమేష్ సూచించారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు సహకరించాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.