దోర్నాల మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి ఇరకసాని దేవయ్య పేరును ఖరారు చేసిన ఎరిక్షన్ బాబు
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 దోర్నాల మార్కాపురం జిల్లా
దోర్నాల మండలంలో పంచాయతీ ఎన్నికలకు టీడీపీ సంసిద్ధం…
దోర్నాల పట్టణం శ్రీశైలం రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దోర్నాల మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమైన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో, స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక చేయటం జరిగినది.
గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాస్ దోర్నాల మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ సాహెబ్, మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

