📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణతొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం..

తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం..

📰 Generate e-Paper Clip

తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలోని దుబ్బా తండా 5వ వార్డు పరిధిలో నిర్మించిన 280 డబుల్ బెడ్‌రూం ఇళ్లను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ కి లబ్ధిదారులు, స్థానిక ప్రజలు డోలు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. సొంతింటి కల నెరవేరుతున్న ఆనందంతో లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో, తాత్కాలిక నివాసాల్లో జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ఈ ఇళ్ల మంజూరు ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, కుటుంబ భద్రతకు, పిల్లల భవిష్యత్తుకు, గౌరవప్రదమైన జీవితానికి పునాది అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి స్థలం అందించిన స్థలదాతను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. సమాజ శ్రేయస్సు కోసం విలువైన స్థలాన్ని అందించడం అభినందనీయమని, ఇలాంటి సహకారం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, వార్డు కౌన్సిలర్ చపాల బాపు రెడ్డి, కౌన్సిలర్లు పెద్దగాని కళావతి సోమన్న, ముద్దసాని సురేష్, భద్రు నాయక్, బసనబోయిన ఐలమ్మ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.