📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబాలల అభ్యున్నతికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం:

బాలల అభ్యున్నతికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం:

📰 Generate e-Paper Clip

బాలల అభ్యున్నతికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం: సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్

గరిడేపల్లి, నవంబర్ 14 (ప్రజావాణి): బాలలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గరిడేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ చత్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. బాలల భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు నైతిక విలువలు, మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు.

విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు వారి అభ్యున్నతికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాతంగి సంజీవ, వార్డు సభ్యురాలు పాతకోటి స్వాతి, గ్రామ కార్యదర్శి గుగులోతు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, బిల్ కలెక్టర్లు రావుల వెంకన్న, సూది రెడ్డి నర్సిరెడ్డి, ఏఎన్ఎం అంజలి, ఫీల్డ్ అసిస్టెంట్ మేకపోతుల సరిత, బొంత వెంకట్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.