📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ

నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ

📰 Generate e-Paper Clip

నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ

ప్రతి ఒక్క దళిత జర్నలిస్ట్ పాల్గొని మహాసభను విజయవంతం చేయాలి

– డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి

మన ప్రజావాణి | సంగారెడ్డి | నవంబర్ 15 | జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి పట్టణంలో నవంబర్ 18న నిర్వహించనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం (డీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర 11వ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి పిలుపునిచ్చారు. మహాసభ ఏర్పాట్లలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క దళిత జర్నలిస్టు ఈ కార్యక్రమానికి హాజరై దళిత జర్నలిస్టుల ఐక్యతను చాటాలని కోరారు. జర్నలిస్టులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రయోజనాలు ప్రథమంగా దళిత జర్నలిస్టులకు అందేలా మనమంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు. హక్కుల సాధనకు ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో జరిగే ఈ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో డీజేఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రమణి అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు దానం మోహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.