📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామంలోకి కొండచిలువలు పట్టించుకోని అధికారులు. ప్రజల్లో భయాందోళనలు.

గ్రామంలోకి కొండచిలువలు పట్టించుకోని అధికారులు. ప్రజల్లో భయాందోళనలు.

📰 Generate e-Paper Clip

గ్రామంలోకి కొండచిలువలు పట్టించుకోని అధికారులు.

ప్రజల్లో భయాందోళనలు.

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతని మండలం దుబ్బ పల్లి గ్రామంలో రోజురోజుకు కొండచిలువలు గ్రామంలోకి చొరబడి ప్రజలను భయాందోళనలు గురిచేస్తున్నాయి తరచూ కొండచిలువలు గ్రామంలో కి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు కొండచిలువల సంచారంతో చిన్న పిల్లలు వృద్దులు పశువుల భద్రతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి న ప్పటికి పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సింగరేణి అధికారులు గ్రామం చుట్టూ ఉన్న భూములను తీసుకొని గ్రామం చుట్టూ ఒక కంచెలాగా తీసుకొని గ్రామాన్ని వదిలేశారని అప్పటినుండి గ్రామంలోకి పాములు విష పురుగులు కొండచిలువలు వస్తున్నాయని ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు కానీ సింగరేణి అధికారులు గాని జోక్యం చేసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.