📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకన్నతల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కుమారుడు....నిందితుడి అరెస్ట్

కన్నతల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కుమారుడు….నిందితుడి అరెస్ట్

📰 Generate e-Paper Clip

*కన్నతల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కుమారుడు….నిందితుడి అరెస్ట్*

*పట్టణ ఎస్ఐ గోపతి నరేష్*

* *మన ప్రజావాణి* *మందమర్రి:-*

పట్టణంలోని విద్యానగర్‌ లో ఇల్లు ఖాళీ చేయించిన విషయంలో కన్నతల్లి పై కన్న కుమారుడే రోకలి బండతో దాడిచేసి, హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో కలకలం సృష్టించింది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ మాట్లాడుతూ, పట్టణంలోని విద్యానగర్‌ కు చెందిన గాదె సారక్క (65) జిల్లాలోని చెన్నూరులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆమె కుమారుడు గాదె రాజమల్లు (46) విద్యానగర్‌ లోని వారి సొంత ఇంటిలో నివసిస్తుండగా, ఆ ఇల్లు ఖాళీ చేయాలని తల్లి కోరుతుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ తీర్మానం మేరకు రాజమల్లు ఇల్లు ఖాళీ చేసి పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక అద్దె ఇంటికి మారాడు. తనను ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో తల్లిని చంపాలని నిర్ణయించుకున్న రాజమల్లు ఈ క్రమంలో శనివారం సారక్క చెన్నూరు నుండి పట్టణంలోని తన సొంత ఇంటికి రాగా, ఇంటి తాళం తీసి ఇద్దరూ లోపలికి వెళ్లిన తర్వాత ఇల్లు ఖాళీ విషయమై మరో మారు వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన రాజమల్లు అక్కడే ఉన్న రోకలి కర్రతో తల్లి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్త గాయంతో ఆమె కింద పడిపోగా, నిందితుడు రోకలి కర్రతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు విచారణ చేపట్టి, శనివారం విద్యానగర్‌ లోని అద్దె ఇంటి వద్ద నిందితుడు గాదె రాజమల్లు ను అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో నిందుతుడిని తన విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి దాడికి ఉపయోగించి ఇంట్లో దాచిన రక్తపు మరకలు గల రోకలి కర్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.