📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణBLR బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో
అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే
బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14

మిర్యాలగూడ
కార్తీకమాసం సందర్భంగా BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో *BLR బ్రదర్స్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 41 రోజుల ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది…
ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని వితరణ చేశారు
ఈరోజు సుమారు 3,500 మంది అయ్యప్ప స్వాములు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
కార్తీకమాసంలో అయ్యప్ప స్వాములకు సేవ చేసే అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 41 రోజుల పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు…
భక్తి, సేవాభావంతో BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.