📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసర్పంచ్ చేతుల మీదుగా ఇందిర మ్మ ఇల్లు భూమి పూజ ప్రారంభం...

సర్పంచ్ చేతుల మీదుగా ఇందిర మ్మ ఇల్లు భూమి పూజ ప్రారంభం…

📰 Generate e-Paper Clip

*సర్పంచ్ చేతుల మీదుగా ఇందిర మ్మ ఇల్లు భూమి పూజ ప్రారంభం…*
నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం:
ప్రజావాణి ప్రతినిధి
నవంబర్ 13…

వెల్దండ మండల కేంద్రానికి చెందిన కొమర లింగమ్మ / అంజయ్య కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య,మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్ ముదిరాజ్,గ్రామ వార్డు సభ్యులు కిష్టల్, వాణి పురుషోత్తం చారి, దేవేందర్, వెంకటేష్, మంజుల శ్రీనివాస్, మానస రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి హమీద్, బొక్కల శ్రీనివాస్ , తుంగ శ్రీనివాస్, పుట్ట యాదయ్య, మట్ట నాగరాజు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ గౌడ్, కాసన్న, విష్ణు,మట్ట మల్లేష్ ,జంగయ్య, కృష్ణయ్య, లింగయ్య, రాము తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.