📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే

రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే

📰 Generate e-Paper Clip

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూభారతి సర్వే.. రైతులు సహకరించాలి

సిద్దిపేట కలెక్టర్ హైమావతి

బెజ్జంకి, నవంబర్ 3 (ప్రజావాణి)

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూభారతి భూముల రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్, సర్వే సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, జిపివో రజిత సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.