📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఒంగోలులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఒంగోలులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

📰 Generate e-Paper Clip

ఒంగోలులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

బండ్లమిట్ట గర్ల్స్ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న
మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 ప్రకాశం జిల్లా

ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నగరంలోని బండ్లమిట్ట గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఒంగోలు టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప, బాలు గార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని కోరారు.

ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.