పీజీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
జమ్మికుంట, నవంబర్ 3 (ప్రజావాణి):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రవే రమేష్ తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన CPGET–2026 పీజీ ప్రవేశాల నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో ఎం.ఎస్సీ బోటనీ, జువాలజీ కోర్సుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.

