*పట్నం రాజేందర్ రెడ్డి జయంతి సందర్భంగా అప్పారెడ్డిగూడ గ్రామానికి క్రికెట్ కిట్ అందజేసిన మాజీ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి*
*రాజేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అప్పారెడ్డిగూడ గ్రామస్తులు*
*పట్నం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్థులు*
షాబాద్ నవంబర్ 08(మన ప్రజావాణి )
షాబాద్: పట్నం రాజేందర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని షాబాద్ మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి క్రికెట్ కిట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా షాబాద్ మండల కేంద్రంలోని పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి అప్పారెడ్డిగూడ మాజీ సర్పంచ్ పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్ , గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిద్దెలరామచంద్రయ్య, ఎలుకగారినర్సింలు, మిద్దెలసత్యనారాయణ, ఎకబాల్ మియా, ఇస్మాయిల్, మిద్దెలఅంజి, పోలేపల్లి సాయి, పోలేపల్లి వెంకటేష్ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.

