📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

📰 Generate e-Paper Clip

డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

•ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడితో ప్రత్యేక సమావేశం.

•ప్రజల ఇబ్బందులను వివరించిన.. తోటకూర వజ్రేష్‌ యాదవ్‌..

జవహర్‌నగర్‌ నవంబర్ 2 (ప్రజావాణి ప్రతినిధి)

డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి స్థానిక ప్రజలకు విముక్తి కల్పించాలని మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ కోరారు. ఎన్నో ఏళ్లుగా డంపింగ్‌ యార్డ్‌ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పర్యావరణ కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌తో ప్రత్యేకంగా సమావేశమై డంపింగ్‌ యార్డ్‌ సమస్యపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డంపింగ్‌ యార్డ్‌ నుంచి వెలువడుతున్న దుర్వాసన, గాలి, నీటి కాలుష్యం, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన పరిస్థితులపై వివరించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ సమస్యను ఇకపై నిర్లక్ష్యం చేయడానికిw వీల్లేదని వివరించారు. డంపింగ్‌ యార్డ్‌ సమస్య కేవలం జవహర్‌నగర్‌కే పరిమితమైనది కాదని, పరిసర ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్య అని నాయకులు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, సంబంధిత శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులు పాటించడంతోపాటు ప్రజలకు శాశ్వత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కోరారు. జవహర్‌నగర్‌ ప్రజల పక్షాన ఈ సమస్యను రాష్ట్రస్థాయి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ డంపింగ్‌ యార్డ్‌ సమస్యపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జవహర్‌నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్‌ గౌడ్‌, మాజీ సర్పంచ్‌ కారింగుల శంకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్‌, పల్లె సత్యం వంశరాజ్‌, మాజీ కార్పొరేటర్‌ సంగారెడ్డి మనోదర్‌ రెడ్డి, ప్రేమల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు మాట్ల వినయ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శులు గజ్వేల్‌ శంకర్‌, డీఎస్ఎస్‌ వెంకటేశ్వర్లు, నాయకం భాస్కర్‌, కోశాధికారి పోలాస కిరణ్‌ కుమార్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వీర్ల భుజంగం, కొలిపాక సాయికిరణ్‌, కన్నేబోయిన రాజు యాదవ్‌, జడల బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, వడుపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.