📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ విద్య బలరాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ విద్య బలరాం

📰 Generate e-Paper Clip

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ విద్య బలరాం.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 04

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు గ్రామ సర్పంచ్ విద్య బలరాం శనివారం రోజున ప్రారంభించారు.. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యా బలరాం మాట్లాడుతూ…. జుక్కల్ మండలంలో యాసంగి వరి ధాన్యం కోతలు ఈతర జిల్లాలలో పోలిస్తే ముందుగానే ప్రారంభమైనవి అని తెలిపారు.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధన ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యాన్నికి క్వింటలకు రూ.. 500 ప్రోత్సాహక బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ప్రభుత్వం ఏ-గ్రేట్ ధాన్యాన్ని క్వింటలకు రూ..2461 కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ..2,441 చొప్పున కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి పోలు లేకుండా, తేమ శాతం 17 శాతంలోపు ఉండేలా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విద్య బలరం తో పాటు ఉపసర్పంచ్ పూజారి గణేష్, గ్రామ పెద్దలు అనిత సింగ్, సర్పంచ్ కుమారుడు రాజేష్, బొగ్గుల గంగాధర్, గంగారెడ్డి, మంత్రి సాయిలు, హనుమాన్లు, హనుమ రెడ్డి, రమేష్, తదితరులు గ్రామస్తులు , రైతులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.