విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*:-
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపు రావు, మండల విద్యాధికారి, గ్రామ సర్పంచ్ ఫయాజ్ లతో కలిసి సందర్శించి పాఠశాలలోని తరగతి గదులు, రిజిస్టర్లను తనిఖీ చేసి పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, ప్రతి విద్యార్థి విద్యా పురోగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధన అందిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం
నాణ్యతనుపర్యవేక్షించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం సకాలంలో అందేలా సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

