మృతుల కుటుంబాలను పరామర్శించిన చందుపట్ల కీర్తి రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలో పరమపదించిన దేశెట్టి సమ్మయ్య కుటుంబాన్ని, వెంకట్రావుపల్లి గ్రామంలో ఇటీవల పరమపదించిన పెరుమండ్ల నరసయ్య కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని కీర్తి రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజ్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య, బీజేవైఎం జిల్లా నాయకుడు పంజాల కుమార్, బీజేపీ జిల్లా నాయకుడు కుర్ర సురేందర్ రెడ్డి, చిట్యాల విజయకుమార్, బూత్ అధ్యక్షుడు స్వామి, మై భారత్ జిల్లా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

