📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమార్చాల గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

మార్చాల గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

📰 Generate e-Paper Clip

*మార్చాల గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…*

*గ్రామాభివృద్ధికి సహకరిస్తామని హామీ*

కల్వకుర్తి ప్రజావాణి
ప్రతినిధి:-
అక్టోబర్ 27:

మార్చాల గ్రామ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మార్చాల గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు,ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి డైరీలోని వివరాలను పరిశీలిస్తూ, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు,గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల (యూపీఎస్) ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు,ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపసర్పంచ్ నిజాముద్దీన్, వార్డు సభ్యులు వట్టేపు కిషోర్,మాయని సుమంత రాజశేఖర్,రజిత మల్లేష్, పర్వత్ రెడ్డి,సికిందర్, అక్షయ విశ్వేశ్వర్, యాదిరాల యాదయ్య, బిజినపల్లి స్వాతి బాలరాజు,పల్స అనురాధ జంగయ్య, కంకల అలివేల జంగమయ్య,వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.