📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాద్రి పృథ్వీరాజ్ నివాసంలో బతుకమ్మ సందడి

మాద్రి పృథ్వీరాజ్ నివాసంలో బతుకమ్మ సందడి

📰 Generate e-Paper Clip

మాద్రి పృథ్వీరాజ్ నివాసంలో బతుకమ్మ సందడి!

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు

బతుకమ్మ పాటలతో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు

పటాన్‌చెరు, అక్టోబర్ 18 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన సద్దుల బతుకమ్మ వేడుకలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ నివాసంలో ఘనంగా జరిగాయి. పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో పాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తంగేడు, గునుగు తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలతో కలిసి జరుపుకోవడం విశేషంగా నిలిచింది. పూలను పూజించే తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటుతూ సాగిన ఈ వేడుకలు సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.