మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..
చదువుతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..
రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు దస్తీరం..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 28
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, చదువుతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దస్తిరం అన్నారు.. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా బుధవారం రోజున జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. జుక్కల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డోంగ్లే ఉమాకాంత్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దస్తీరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అలవాటు చదువుతోపాటు ఆరోగ్యంపై త్రీవ ప్రభావం చుపుతుందని తెలిపారు.. ఒత్తిడికి గురైనప్పుడు ఆటలు పాటలు, స్నేహితులతో గడపడం ద్వారా ఉపశమానం పొందాలి తప్ప మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు దస్థిరాం, జుక్కల్ మండలం అధ్యక్షులు ఉమాకాంత్ పటేల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కళాశాల ఉపాధ్యాయులు, సాయిలు, నాగరాజు, రమేష్, సంతోష్, తదితరులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు..

