ప్రభుత్వ భూమి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
బెస్తవారిపేట తహసీల్దార్ గారికి చెట్టిచర్ల sc సామాజిక మాదిగలు వినతి
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 26
– దళిత కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ – అగ్రకుల వివక్షను అరికట్టాలని విజ్ఞప్తి.
బెస్తవారిపేట మండలం, చెట్టిచర్ల గ్రామ దళిత కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ ..56. లో గల ప్రభుత్వ భూమిని గ్రామంలోని మకాం వేంకటరెడ్డి అగ్రకుల భూస్వామీ అక్రమంగా ఆక్రమించుకొని, దళితులను కులం పేరుతో దూషిస్తూ, బెదిరిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ దళితులు ఈరోజు బెస్తవారిపేట తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు
ప్రభుత్వ భూమి ఆక్రమణ:
దళితులు ఆ భూమి జోలికి వస్తే కులం పేరుతో దూషిస్తూ, బెదిరిస్తున్నారు.
“చెట్టిచర్ల గ్రామంలో
దళిత కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణలను వెంటనే తొలగించాలి.
దళితులను కులం పేరుతో దూషించి, బెదిరిస్తున్న మారం వెంకటరెడ్డి పై చర్యలు తీసుకోని ఆ ప్రభుత్వ భూమిని దళిత కాలనీ అవసరాలకు రిజర్వ్ చేయాలని కోరారు గ్రామంలో అగ్రకుల వివక్ష లేకుండా , దళితులకు రక్షణ కల్పించాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో చెట్టిచర్ల గ్రామ దళితులు, MRPS రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి షాలేంరాజ్ జిల్లా నాయకుడు జయరాజ్ బుదాల ఆనంద్ మహిళా నాయకులు కువ్వారపు జయమ్మ ప్రియాంక బుదాల తిమోతి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

