పెద్దవంగర మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పెద్దవంగర అక్టోబర్ 26 ప్రజావాణి మండలంలోని బీసీ తండా, పోచంపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. రైతులకు ధాన్యం విక్రయించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం మహబూబ్ పాషా, సీసీలు సుజాత, ఉమారాణి, సుధాకర్, ఆపరేటర్ అనిల్‌తో పాటు ఆయా గ్రామ సమాఖ్యల వీవోఏలు, అధ్యక్షులు పాల్గొన్నారు.

