📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ టైగర్ నల్ల నర్సింహులు చరిత్ర ను భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి..

తెలంగాణ టైగర్ నల్ల నర్సింహులు చరిత్ర ను భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి..

📰 Generate e-Paper Clip

తెలంగాణ టైగర్ నల్ల నర్సింహులు చరిత్ర ను భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి..

ప్రతి పాఠశాలకు నల్ల నరసింహులు చిత్రపటం అందజేయాలనే వినూత్న సంకల్పం

నల్ల నర్సింహులు తనయ అరుణ, సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి):
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ధైర్యసాహసాలకు, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన సీపీఐ నాయకుడు, తెలంగాణ టైగర్, జనగామ సింహం నల్ల నరసింహులు చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఆయన కుమార్తె నల్ల అరుణ, సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన ఈ పోరాట యోధుడి చిత్రపటాన్ని మండలంలోని ప్రతి పాఠశాలకు అందించి, విద్యార్థుల్లో చారిత్రక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ విముక్తి పోరాటంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, పలుమార్లు పోలీసులకు పట్టుబడినా వెనుకడుగు వేయకుండా పోరాటాన్ని కొనసాగించిన నల్ల నరసింహులు, మూడుసార్లు ఉరిశిక్షలను ఎదుర్కొన్న ధీశాలి, న్యాయస్థానాల్లోనూ అత్యంత ధైర్యంగా తన వాదనలు వినిపించి ‘తెలంగాణ టైగర్’, ‘జనగామ సింహం’గా గుర్తింపు పొందిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం కడవెండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) కు నల్ల నరసింహులు చిత్రపటాన్ని నల్ల అరుణ, ఏల సుందర్ లు శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం, విముక్తి, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు తెలియజేయడం ద్వారా వారిలో సామాజిక చైతన్యం, దేశ చరిత్రపై అవగాహన పెంపొందుతుందని అన్నారు. మహనీయుల త్యాగాలను పుస్తకాలకే పరిమితం చేయకుండా, వారి చిత్రపటాలు మరియు జీవిత విశేషాల ద్వారా విద్యార్థులకు చేరువ చేయాలనే నల్ల అరుణ ప్రయత్నం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో
పాఠశాల ప్రధానోపాధ్యాయులుఎన్.ఎన్. రాజు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఉపాధ్యాయులు మోహన్, వెంకటేశ్వర్లు, మంజుల, తులసి, మాధవి, ప్రణీత, సురేష్, శ్రీనివాస్, గ్రామస్తులు బిట్ల రామచోక్కం, కాషాబోయిన యాకన్నా, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.