📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetకష్టకాలంలో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు

కష్టకాలంలో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు

📰 Generate e-Paper Clip

అండర్‌ డ్రైనేజీ పనులపై సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్ ఆందోళన

*కోదాడ అక్టోబర్ 08(ప్రజావాణి)*: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పనులను ముందుచూపుతో చేపట్టాలని సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్ అధికారులను కోరారు. కోదాడ పట్టణంలో అండర్‌ డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం కోసం ఇప్పటికే ఉన్న తారు రోడ్లను మధ్యలో తవ్వి సుమారు తొమ్మిది అంగుళాల పైపులు ఏర్పాటు చేసి తిరిగి కప్పుతున్నారని, దీనివల్ల మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగే అవకాశాలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.పట్టణంలోని ఇప్పటికే ఉన్న మురుగు కాలువలను సక్రమంగా శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని, వాటి నిర్వహణ సరిగా లేకపోతే కొత్తగా అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. మురుగు కాలువల్లో తగినంత ప్రవాహం లేకపోతే ప్రజాధనంతో చేపట్టే పనులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని అన్నారు.మరోవైపు మిషన్‌ భగీరథ పనుల కోసం తవ్విన గుంతలు, నల్లా కనెక్షన్లు, ఇతర పైపులైన్ల కోసం చేపడుతున్న తవ్వకాలతో పట్టణంలోని రహదారులు అస్తవ్యస్తంగా మారుతున్నాయని బషీరుద్దీన్ తెలిపారు. ఇప్పటికే ఉన్న సీసీ రోడ్లు, తారు రోడ్లను పదేపదే ధ్వంసం చేయకుండా, సాధ్యమైన చోట ముందుగా మట్టి రోడ్లపై అవసరమైన పైపులైన్ల పనులు చేపట్టి, అనంతరం శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.అభివృద్ధి పనుల్లో సమన్వయం, నాణ్యత, ప్రజాధన పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.