ఎల్నినో కరువుపై కేంద్రం స్పందించాలి
– జాడి ఈశ్వర్ నేతకాని డిమాండ్
వెంకటాపురం (నూగురు), అక్టోబర్ 19 (ప్రజావాణి): దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో ఎండిపోయిన పంటలు, ఉపాధి కోల్పోయిన పేదలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు ప్రకటించాలని ఏజెన్సీ నేతకాని హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్ నేతకాని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తెలంగాణను కరువు పీడిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. వర్షాభావంతో నష్టపోయిన పంటలకు హెక్టారు చొప్పున పరిహారం అందించడంతో పాటు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు. ఉపాధి కోల్పోయిన పేదలకు నెలకు రూ.5,000 కరువు భత్యం ఇవ్వాలని, ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి, ఉచితంగా అదనపు రేషన్ సరుకులు, తాగునీరు, ఉచిత పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

