ఉమామహేశ్వర దేవస్థానాన్ని సందర్శించిన చింతలపాలెం ఎస్సై , ఎండోమెంట్ అధికారులు.
హుజూర్నగర్ అక్టోబర్ 20 (ప్రజావాణి)

హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలోని శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ను దసరా పండుగ సందర్భంగా కొత్తగా నియమితులైనటువంటి ఎండోమెంట్ అధికారి ఈవో కూన్ రెడ్డి కొండారెడ్డి, చింతలపాలెం ఎస్సై పరమేష్ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దేవాలయ కమిటీ చైర్మన్ కారంగుల హుస్సేన్, కమిటీ సభ్యులు ఆలయంలో వారిని శాలువాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోర్తాల సీతారెడ్డి, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు వీరం రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, చిత్తలూరి వీరబాబు, కమిటీ సభ్యులు చింతలచెరువు వీర్రాజు, గంధం కొండ, నేమోజు పరిపూర్ణాచారి, దొండపాటి నాగమణి, చిలక యేసు, గూడెపు కొండ పాల్గొనడం జరిగింది.

