📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరా గాంధీ త్యాగాలు, సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం:

ఇందిరా గాంధీ త్యాగాలు, సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం:

📰 Generate e-Paper Clip

ఇందిరా గాంధీ త్యాగాలు, సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం:

టీపీసీసీ సభ్యులు, వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జనగామలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైటీడీఏ మెంబర్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ
ఇందిరా గాంధీ దేశం కోసం చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆమె ఉక్కు మహిళగా ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడుతూ ఇందిరా గాంధీ గారు చూపిన నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశ రక్షణ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంపొందించడంలో ఆమె పాత్ర ఎంతో గొప్పదని గుర్తుచేశారు.
అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. భారత తొలి ఉపప్రధానిగా, హోంమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ తో కలిసి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి ఆయా సంస్థానాల పాలకులతో చర్చలు జరిపి, తన రాజకీయ చతురతతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారని అన్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సర్దార్ పటేల్ వారసత్వం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు దేశ నిర్మాణంలో ఆయన చేసిన అసలైన కృషిని గుర్తించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దేశ స్వాతంత్ర్యం, సమైక్యత, అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు చేసిన త్యాగాలు, సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్, డీసీసీ ఈసీ మెంబర్ అర్జుల సుధాకర్ రెడ్డి, మాజీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జాఫర్ షరీఫ్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల వెంకట రెడ్డి, ధరావత్ రాజు, ఇస్మాయిల్, సలీం, మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ షకీల్, సభ్ధార్, అలీమొద్దీన్, 16వ వార్డు అధ్యక్షుడు నిడిగొండ ముత్యాలు, ఎదునూరి యాదగిరి, యాసరపు పర్ష రాములు, సేవాదళ్ నాయకులు పర్ష రాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.