అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల అధ్యక్షులు యస్ .బాలాజీ డిమాండ్..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 26
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అసైన్మెంట్ భూములకు లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని జుక్కల్ మండల తాసిల్దార్ మరోతి సార్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం యువడం జరిగింది. ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల అధ్యక్షులు యస్.బాలాజీ మాదిగ మరియు ముఖ్య ముఖ్య అతిథులు జుక్కల్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఆయిల్ వార్ మరోతి మాదిగ వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా యస్ బాలాజీ మాదిగ మాట్లాడుతూ,గతంలో ప్రభుత్వం ప్రకటించిన హామీలను అమలు చేసి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్, రాజు యువ వికాస్, ఎస్సీ సాబ్ ప్లాన్ నిధులు, అంబేద్కర్ అభయ హస్తం 12,00000 లక్షలు ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి సంక్షేమ పథకాల ద్వారా మాదిగలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.యస్ బాలాజీ మాదిగ జుక్కల్ మండల ఉప అధ్యక్షులు కె సాయిలు మాదిగ ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

