📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఅల్లవాడలో మొదలైన బతుకమ్మ సందడి. మహిళలు చిన్నారుల కోలాహలం.

అల్లవాడలో మొదలైన బతుకమ్మ సందడి. మహిళలు చిన్నారుల కోలాహలం.

📰 Generate e-Paper Clip

అల్లవాడలో మొదలైన బతుకమ్మ సందడి.
…. మహిళలు చిన్నారుల కోలాహలం.
….. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు.
…. పండుగతో అల్లవాడ గ్రామంలో పండుగ శోభ.
రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 19 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో ఆదివారం రాత్రి 9:30 వరకు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు ప్రకృతి ప్రేమకు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సందడి గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య ఆధ్వర్యంలో మొదలైంది. రంగు రంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు చిన్నారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ అల్లవాడ గ్రామంలో సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యల ఆధ్వర్యంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. సాంప్రదాయ దుస్తులు ధరించి గ్రామ మహిళలు పూల బతుకమ్మలను చేతబట్టి ఒకచోట చేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. చిన్నారులు సైతం బతుకమ్మలను పట్టుకొని వేడుకల్లో పాల్గొంటూ అందరిని ఆకట్టుకున్నారు. తంగేడు గునుగు తదితర రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో బతుకమ్మ పండుగ కీలకపాత్ర పోషిస్తుంది. మహిళలు చిన్నారులు కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొనడం గ్రామంలో ఐక్యత ఆత్మీయతకు ప్రతికగా నిలుస్తుంది. అలవాడ గ్రామంలో మహిళలు చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అల్లవాడ గ్రామంలో బతుకమ్మ పాటలు పూలసోయగాలితో పండుగను సంతరించుకున్నాయి. ఈ బతుకమ్మ సంబరాలను అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య ల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరిగినప్పటికీ రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు బతుకమ్మను గంగమ్మ ఒడిలో వదిలారు ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పంచాయతీ వార్డు సభ్యులు అల్లవాడ గ్రామం మహిళలు తదితరులు ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.