సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు బి ఆర్ స్ నేత మొలుగు ఆనంద్ రావు

*కూకట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులుకు ఘన సన్మానం*
కూకట్పల్లి విలేజ్ : ( ప్రజావాణి) సెప్టెంబర్ 5 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.
సీతారామచంద్ర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ మరియు కూకట్ పల్లి డివిజన్ బి.ఆర్.స్ పార్టీ సీనియర్ నాయకులు మొలుగు ఆనంద్ రావు ఎమ్మెల్యే కృష్ణారావుతో కలసి కూకట్ పల్లి లోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో లొని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆనంద్ రావు మాట్లాడుతు ఈ పాఠశాల నుంచే ఎంతో మంది విద్యార్థులు చదివి నేడు గొప్ప గొప్ప స్దయిలో ఉన్నారని అందుకు కారణం ఉపాధ్యాయులేనాని అన్నారు, మనకు విద్య బుద్దులు నేర్పిన గురువులను మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని విద్యార్థులతో అని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో మాజీ కార్పొటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

