📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadసమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

📰 Generate e-Paper Clip

సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

కోటగిరిలో అంబేద్కర్ అభిమానుల నిరసన.పోలీసులకు వినతి పత్రం అందజేత.

హమారా ప్రసాద్ వ్యవహారశైలిపై మండిపడ్డ మాల మహానాడు ప్రతినిధులు.

కోటగిరి/ప్రజావాణి:-మహాపురుషులు,అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పాటుపడిన డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను కించపరిచేలా ప్రవర్తిస్తున్న హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని మాల మహానాడు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోటగిరి,పోతంగల్ మండలాలకు చెందిన మాల మహానాడు ప్రతినిధులు,అంబేద్కర్ అభిమానులు హమారా ప్రసాద్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.అనంతరం స్థానిక కోటగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మిర్జాపూర్ సాయన్న, పుప్పాల మారుతి మాట్లాడుతూ.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఉనికిలో లేదని విమర్శిస్తూ సమాజంలో విద్వే షాలు రెచ్చగొడుతున్న హమారా ప్రసాద్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నిత్యం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును అవమాన పరుస్తూ,అవహేళనగా వ్యవహరిస్తూ కుల,మత,జాతుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న ఆయనకు తగిన విధంగా శిక్షించాలన్నారు.ఈ రకమైన అప్రతిష్ట చర్యల వల్ల సమాజం లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతి నిధులు బ్యాగరి రాములు,పుప్పాల సైదయ్య,పాల గంగారం,గైని శంకర్,గైని గజానంద్,మోరె జీవన్,క్యూ.శివ శంకర్,ఎన్.రవి,ఎన్.పవన్,ఎన్.సందీప్,ఎన్.శాం రావు, ఎన్.విఠల్,గంగారాం,ఎన్.భూమయ్య, ఎన్.వినయ్, ఎన్.శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.