నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న వరి రకాల విత్తన విక్రయ నిర్వహణ వ్యవస్థకు సంబంధించి రైతులందరి నమోదులను పూర్తి చేయడానికి మరియు అధికారులచే ధృవీకరణ కోసం గడువు తేదీని సెప్టెంబర్ 15 వ వరకు పొడిగించడం జరిగింది. నేటికీ ఇంకా చేసుకొని రైతు సోదరులు త్వరగా మీరు విత్తనాలు కొన్న విత్తన డీలర్ల వద్ద 500/- బోనస్ కోసము రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. సొంత విత్తనాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రం నుండి కొనుగోలు చేసిన విత్తనాలకు మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

