మద్దూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బూర్గు రాజుగౌడ్ నియామకం
మద్దూరు సెప్టెంబర్10, ప్రజా వాణి,
జనగామ జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి సూచనల మేరకు మద్దూరు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి మద్దూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా బూరుగు రాజు గౌడ్ ను నియమస్తూ గురువారం ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షునికి శాలువా కప్పి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దూరు మండల్ ఉపాధ్యక్షులు.జీడికంటి సురేష్,మండల
మండల ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఆరిఫ్, కార్యదర్శిలు.చిలుక రాంబాబు,బోయిని రాంబాబు,మరియు సీనియర్ నాయకులు తాజ్ భాయ్. మహమ్మద్ షౌకత్,మద్దూర్ వార్డ్ మెంబర్ సురేష్.మొహమ్మద్ ముంతాజ్,తదితరులు పాల్గొన్నారు.

