📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభార్యను ఇంట్లో తాళం వేసి... పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ పిర్యాదు 

భార్యను ఇంట్లో తాళం వేసి… పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ పిర్యాదు 

📰 Generate e-Paper Clip

భార్యను ఇంట్లో తాళం వేసి… పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ పిర్యాదు

 

 

పోలీసులను తప్పుత్రోవ పట్టించేందుకు ప్రయత్నం

 

 

భర్తపై పోలీసులు గృహహింస కేసుకు రంగం సిద్ధం

 

 

మద్దూరు సెప్టెంబర్ 10, ప్రజా వాణి,

 

 

కట్టుకున్న భార్యను గత కొన్ని సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలు పెట్టీ నరక యాతన చూపెడుతున్న భర్తపై గృహహింస కేసు పెట్టేందుకు పోలీసులు కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే. .. పోలీసులు తెలిపిన ప్రకారం మద్దూరు గ్రామానికి చెందిన నారదాసు సిద్దయ్య పశు వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తు తరచూ భార్య కనుక లక్ష్మీపై అనుమానంతో ఆమెను చిత్ర హింసలకు గురి చేసేవాడు పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి గొడవలు చేసుకోవొద్దని చెప్పడం జరిగిందని కనక లక్ష్మీ అన్న శ్రీపతి పల్లికి చెందిన వెంకటరాజయ్య విలేఖర్లకు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం భర్త సిద్దయ్య భార్యను ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో పెట్టీ తాళం వేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నా భార్య 1లక్ష 40 వేలు తీసుకుని పారీపోయిందని భర్త పిర్యాదు చేయడంతో ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ విచారణ చేపట్టడంతో ఇంట్లోనే తాళం వేసి ఉంచాడని తేలడంతో ఇంటివద్దకు పోలీసులు వచ్చి తలుపు తీయడంతో భార్య కనుక లక్ష్మి ఇంట్లోనే బోరున విలపిస్తు ఉంది. ఆమెకు జరిగిన అన్యాయం, చిత్ర హింసలపై పోలీసులకు తెలపడంతో భర్త నారదాసు సిద్దయ్యపై గృహహింస కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.