బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పరామర్శ
దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు కసిరెడ్డి నవీన్ రెడ్డి బంధువులు ఉప్పల్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఉప్పల్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
ఉప్పల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

