బాధితురాలికి సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన చొప్పరి సాగర్
మద్దూరు సెప్టెంబర్10, ప్రజా వాణి,
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన బందారం లక్ష్మి యాకూబ్ గౌడ్ కు 15000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ధూళిమిట్ట మండల బి అర్ ఎస్ క్లస్టర్ ఇంచార్జ్ చొప్పరి సాగర్ ముదిరాజ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తూనే పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి సేవలను జనగామ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి రావడం ఎంతో అదృష్టం అని ప్రజలు భావిస్తున్నారు.ఈకార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ స్థానిక నాయకులు దాసరి శ్రీను, తుపాకుల పెద్ది రాజు,ఇస్తారీ సాయిలు మరియు వార్డు సభ్యులు నర్మెట కాశి రాములు, గంగుల సత్తయ్య మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

