ఎండపల్లి మండలం పాతగూడూరులో గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, రేషన్ డీలర్లు, CAలు, మిడ్ డే మీల్స్ సిబ్బందిని గణనాథుని మండపం వద్ద మంగళవారం PSR నగర్ సభ్యులు ఘనంగా సన్మానించారు. సమాజ శ్రేయస్సు కోసం వారు అందిస్తున్న నిస్వార్థ సేవలు మాటల్లో చెప్పలేనివని, వారి కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ఐక్యత, బాధ్యతలను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

