దొరలపై తిరగబడ్డ ధీరవనిత చాకలి ఐలమ్మ
సి పి ఏం జిల్లా కమిటి సభ్యులు ఆలేటి యాదగిరి
మద్దూరు సెప్టెంబర్11, ప్రజా వాణి,
సిపిఎం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 41 వ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ నాడు భూమికోసం బుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతంగా సాయుధపోరాటంలో ఐలమ్మ సాహసం, దొరలపైన తిరగబడ్డ దీరత్వమని ఆమె స్ఫూర్తి తో ఉద్యమాలు జయప్రదం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎండి షఫీ మండల కమిటీ సభ్యులు వేల్పుల విజయ్, సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల నరేష్, రజక వృత్తిదారుల సంఘం నాయకులు పిడిసెట్టి రాజు, మల్లేశం,సాయిలు, నాయకులు ఇష్టమైన మల్లేశం, చందు,శోభన్ కృష్ణ, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
