📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రభుత్వం సలహాదారు....

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రభుత్వం సలహాదారు. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

📰 Generate e-Paper Clip

ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రభుత్వం సలహాదారు. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

పోరుమామిళ్లలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి. చల్ల గిరి గల దేవస్థానం దగ్గర ఉన్న వైయస్సార్ ఆలయంలోని విగ్రహానికి. సిద్ధవరం పంచాయతీ అగ్రహారం గ్రామంలో ఉండే విగ్రహానికి. కొరపాటి పల్లి పంచాయతీ కాలువ కట్ట దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్. ఎంపీటీసీ వెంకటేశ్వర్లు. కె రమణారెడ్డి. దశరధరామిరెడ్డి. అంబవరం రమణారెడ్డి. లక్ష్మి రెడ్డి. జెకె. గొడుగు మస్తాన్. గొడుగు బాబు. పి పెద్ద బాలయ్య. కృష్ణారెడ్డి వెంకటసుబ్బయ్య. గోపాల్ రెడ్డి. రమణయ్య. ఇంకా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నాయకుడిని ఆయన ప్రవేశపెట్టిన .ఫీజు రీఎంబర్స్ మెంట్ . ఆరోగ్యశ్రీ. ఉచిత విద్యుత్. పవల వడ్డీకే రైతులకు . డ్వాక్రా మహిళలకు.రుణాలు. రుణమాఫీ. ఇంకా అనేక రకాలైన సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు ప్రజలందరూ ఈరోజు ఆయనను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని. ఆయన చనిపోయిన ప్పుడు ఆ బాధను తట్టుకోలేక వందలాదిమంది అభిమానులు చనిపోవడం జరిగిందని. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక నాయకుడు చనిపోతే ఇంత మంది గుండె లు ఆగి చనిపోవడం చరిత్రలోనే లేదని వైఎస్ఆర్ యుగపురుషుడని అటువంటి నేత అరుదుగా పుడతారని. తండ్రికి తగ్గ తనయునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పథకాలను తండ్రిలాగే అమలు చేశారని. ఇప్పుడు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ లోని పథకాలను అమలు చేయకపోవడం రాష్ట్రాన్ని అప్పలపాలు చేయడం. సంపద సృష్టిస్తాను అని చెప్పారని. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పడం జరిగిందని. ప్రజలందరూ గమనిస్తున్నారని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్య ప్రజలకు ఇది శాపంగా మారిందని. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని నాగార్జున్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.