*జవహర్ నగర్ లో M.M.C. జోనల్ కమిషనర్ పర్యటన*
జవహర్ నగర్ సెప్టెంబర్ 10 ( ప్రజావాణి ప్రతినిధి)
మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ లో మల్కాజిగిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచి గంగావర్ శుక్రవారం పని కాలనీలో పర్యటించారు………..
ఆయన వెంట స్థానిక సీనియర్ బిజెపి నాయకులు మాజీ కార్పొరేటర్ బాబు పలు కాలనీలలో ఉన్న సమస్యలను దగ్గరుండి చూపించి వాటిని పరిష్కరించాలని కోరారు……… స్పందించిన కమిషనర్ భక్తబాయి, న్యూ వెంకటేశ్వర కాలనీ, ముత్తుస్వామి కాలనీ లలో గల ఓపెన్ నాలాల నిర్మాణం విడుదలవారీగా చేపట్టి వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉండి పరిష్కారం చూపుతామని తెలిపారు………… లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ ఎదురుగా ఓరిని పూడ్చివేసి నీళ్లు వెళ్లకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని తొలగించి వర్షాకాలం నీరు సాఫీగా వెళ్లేందుకు చూడాలని స్థానిక అధికారులకు కమిషనర్ ఆదేశించారు……… విడతల వారీగా ప్రభుత్వ నిధులను జవహర్ నగర్ లో నెలకొన్న ప్రధాన సమస్యలకు కేటాయించి వాటి ద్వారా అత్యవసర పరిస్థితులు నెలకొన్న కాలనీలలో గల ప్రతి సమస్యను ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు……….. కమిషనర్ ఆకస్మిక పర్యటన వల్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయా కాలనీలలోని ప్రజలు ఆయన వెంట నడిచి వారి వారి సమస్యలను కమిషనర్ సంచిది గంగ వరకు తెలిపారు………



