ఊరూరా ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ, మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో ముత్యాలమ్మ బోనాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాలు ఉత్సవానికి శోభ తీసుకొచ్చాయి. ఇలాంటి బోనాల వేడుకలు తెలంగాణలో సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు,
ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

