📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకబడ్డీలో అన్నోజిగూడ బాలికల జోరు!....ఘట్కేసర్‌–మేడిపల్లి జోన్‌ స్థాయి పోటీల్లో అండర్‌–17లో ప్రథమ స్థానం

కబడ్డీలో అన్నోజిగూడ బాలికల జోరు!….ఘట్కేసర్‌–మేడిపల్లి జోన్‌ స్థాయి పోటీల్లో అండర్‌–17లో ప్రథమ స్థానం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 8: కబడ్డీ క్రీడలో అన్నోజిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తాచాటారు. ఘట్కేసర్‌–మేడిపల్లి జోన్‌ స్థాయి కబడ్డీ పోటీల్లో అండర్‌–17 బాలికల విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు.

ఘట్కేసర్‌ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని శాంతినికేతన్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 25 జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అన్నోజిగూడ విద్యార్థినులు సమష్టి ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను అధిగమించి విజేతలుగా నిలిచారు.

విజేత విద్యార్థినులను టీమ్‌ రేవంత్‌ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ప్రతాపరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు మంద విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థినుల క్రీడా ప్రతిభను ప్రశంసిస్తూ, రాబోయే పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.