📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఓహోఇండియా ఆరోగ్య సంరక్షణ సభ్యత్వంతో పలు ప్రయోజనాలు

ఓహోఇండియా ఆరోగ్య సంరక్షణ సభ్యత్వంతో పలు ప్రయోజనాలు

📰 Generate e-Paper Clip

6 మంది కుటుంబ సభ్యులకు ఏడాదికి 24 సార్లు నగదు రహిత వైద్య సంప్రదింపులు

నెట్‌వర్క్ ఆసుపత్రుల బిల్లులపై 30 శాతం వరకు రాయితీ

ప్రైమరీ సభ్యుడికి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా రక్షణ

బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఓహోఇండియా హెల్త్ బెనిఫిట్స్ అకౌంట్ ద్వారా సభ్యులకు పలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు సంవత్సరానికి మొత్తం 24 సార్లు నగదు రహితంగా వైద్యుల సంప్రదింపులు పొందే అవకాశం ఉందన్నారు. ఈ సర్వీస్ క్రెడిట్స్ వాలెట్ గరిష్ట విలువ రూ.12,000గా పేర్కొన్నారు.అదేవిధంగా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్య బిల్లులపై 30 శాతం వరకు రాయితీ పొందే స్మార్ట్ సేవింగ్స్ వాలెట్ సదుపాయం ఉందని తెలిపారు. దీని గరిష్ట విలువ రూ.25,000గా ఉందన్నారు.ప్రమాద బీమా రక్షణ18 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత సంపూర్ణ అంగవైకల్యం, శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి రూ.1 లక్ష వరకు బీమా రక్షణ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భంలో రూ.10,000 వరకు లేదా వాస్తవ ఖర్చు, ఏది తక్కువైతే అది వర్తిస్తుందని పేర్కొన్నారు.
హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్
ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరినప్పుడు రోజుకు రూ.500 చొప్పున గరిష్టంగా 30 రోజుల వరకు హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ICUలో చేరినప్పుడు సాధారణ డైలీ క్యాష్‌కు అదనంగా మరో 100 శాతం ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు. AYUSH చికిత్సకు గరిష్టంగా 15 రోజుల వరకు ప్రయోజనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అంత్యక్రియల ఖర్చులకు రూ.5,000 వరకు, మృతదేహ రవాణాకు బీమా మొత్తంలో 2 శాతం లేదా రూ.5,000లో ఏది తక్కువైతే అది వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోజనాలన్నీ సంబంధిత నిబంధనలు, అర్హతలు, వెయిటింగ్ పీరియడ్‌కు లోబడి ఉంటాయని తెలిపారు. 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో పాటు ముందుగా ఉన్న వ్యాధులకు (PED) ప్రత్యేక వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుందని సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఇన్సూరెన్స్ యాజమాన్య ప్రతినిధులు ప్రభంజన్, శ్రీకాంత్, ప్రశాంత్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.